TG: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి KTR బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఏ ఊరిలోనైనా 80 శాతం పంట కొనుగోళ్లు జరిగాయని నిరూపిస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోనైనా 80 శాతం పంట కొనుగోళ్లు చేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భూ దోపిడీ మీద ఉన్న శ్రద్ధ, భూమిని నమ్ముకున్న రైతుల మీద లేదని KTR ధ్వజమెత్తారు.