కృష్ణా: మైలవరం టీడీపీ కార్యాలయంలో లైవ్ స్టాక్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ జగన్పై ఫైర్ అయ్యారు. జగన్ మొదటి అడుగే శవ రాజకీయం, తల్లి,చెల్లి దొంగ అని దూరం పెట్టారు అని విమర్శించారు. రంగాను పొట్టన పెట్టుకున్న కుటుంబానికి హైదరాబాద్లో కోట్ల విలువైన భూమి ఎందుకు కట్టబెట్టావని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ వితండవాదం చేస్తున్నాడని మండిపడ్డారు.