సత్యసాయి: పెనుకొండ సివిల్ సప్లై గోదాం వద్ద ఏపీ సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీలు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిక్షాటన చేశారు. హమాలీలకు కూలి రేట్లు పెంచడంతో పాటు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని నాయకులు కోరారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.