NTR: ఆలయ భూములపై వైసీపీ నేత దేవినేని అవినాష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలు దోపిడీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. గొడుగు వెంకటేశ్వర స్వామి భూమిని కబ్జా చేసేందుకు విజయవాడ ఉత్సవాలను వాడుకున్నారని అన్నారు. కోర్టు 56 రోజుల తర్వాత స్థలం ఖాళీ చేయాలని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. అధికారులు స్పందించాలని ఆయన అన్నారు.