SRPT: తుంగతుర్తిలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ కార్మికుడు చర్లపల్లి సోమయ్య వడదెబ్బకు గురై మృతి చెందాడు. శుక్రవారం సోమయ్య కుటుంబ సభ్యులకు పీఏసీఎస్ ఛైర్మన్ సైదులు సొసైటీ తరపున దహన సంస్కారాలకు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దయానందం, ఎస్సై క్రాంతి కుమార్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.