KRNL: ఆదోనిలో రైల్వే ట్రాక్షన్ విభాగంలో జేఈగా పనిచేస్తున్న పీ. బాలరాజును రైల్వే అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 17న నంద్యాల రైల్వే స్టేషన్లో జరిగిన దొంగతనం కేసులో బాలరాజును పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలులో నమోదైన మరో చోరీ కేసుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయింది.