NRML: కడెం మండలంలోని ఉడుంపూర్కు చెందిన మింగని సువర్ణ, ఘర్షకుర్తి మహేష్ బెడద సంజీవ్లకు చెందిన సుమారు నాలుగు గేదెలు గత సంవత్సరం విద్యుత్ ఘాతకానికి గురై మృతి చెందాయి. దీంతో ప్రభుత్వం ఒక్కో గేదెకు రూ.40,000 చొప్పున నష్టపరిహారం చెల్లించడంతో నష్టపరిహారానికి చెందిన చెక్కులను సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా బాధితులకు అందజేశారు.