MHBD: జిల్లా రెడ్యాల వృద్ధాశ్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందిన సుజాత(70) పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అందజేశారు. శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ దేహదానం కార్యక్రమం నిర్వహించినట్లు క్లబ్ కార్యదర్శి పరకాల రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు ఉన్నారు.