HNK: హసనపర్తి(M) సమీపంలోని ORR వద్ద ఇవాళ ద్విచక్రవాహనం ప్రమాదానికి గురై దంపతులు గాయపడ్డారు. గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వారు ఏనుమాముల మార్కెట్ నుంచి తిరిగి వస్తుండగా మహిళ చీర బైక్ చక్రంలో ఇరుక్కోవడంతో వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న CI మహేందర్ వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.