BPT: చీరాల సమీపంలోని ఓడరేవు సముద్ర తీరానికి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఈ వ్యక్తి గురించి సమాచారం తెలిసిన వారు ఎస్సై లేదా చీరాల రూరల్ సీఐను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.