KKD: ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామంలో నేరెళ్లతల్లి జాతర మహోత్సవం సందర్భంగా వచ్చే నెల 5వ తేదీన జూనియర్, సీనియర్ ఎడ్ల పరుగు పోటీలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.