ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’లో ప్రముఖ దక్షిణ భారత నటుడు గురు సోమసుందరం భాగమయ్యాడు. ఇందులో ఆయన ‘రావు’ అనే కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.