WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండకు చెందిన కుంట నాగలక్ష్మి (57) గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 21న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.