కడప జిల్లాల అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అధికారులు విడుదల చేశారు. 5వ తరగతి ప్రవేశాల కౌన్సిలింగ్ మే 26, 27 తేదీల్లో,ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కౌన్సిలింగ్ మే 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని DCO ఉదయశ్రీ సూచించారు.