MDCL: ప్రజా ప్రతినిధులు, అధికారులు సహా అందరి సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మల్కాజిగిరి జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో నిర్వహించిన 99 రోజుల “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.