IPL 2026లో భాగంగా కోల్‌కతా, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో బ్యాటర్లు తడబడుతున్నారు. అనుకుల్ రాయ్ వేసిన 15.2 ఓవర్‌కు ముకుల్ చౌదరి (1) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బదోని (16*), హిమ్మత్ సింగ్ (0*) ఉన్నారు. లక్నో విజయానికి 24 బంతుల్లో 52 పరుగులు అవసరం.