NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని శ్రీ తిరుమలనాథ దేవస్థానాన్ని ఇస్కాన్ ప్రతినిధులు పరమానంద దాస్, శివప్రసాద్ దాస్ సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులకు భగవద్గీత గ్రంథాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాటం వెంకటేశం, ఉపసర్పంచ్ సైదులు, యాదయ్య, హరీష్ రెడ్డి, నరసింహ, వెంకన్న ఉన్నారు.