KDP: రాజుపాలెం (M) వెల్లాలలో గురువారం శ్రీ చెన్న కేశవ, సంజీవరాయ, భీమ లింగేశ్వరస్వామి ఆలయాల దేవస్థాన కమిటీ ఛైర్మన్గా గంగిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MLA నంద్యాల వరదరాజులరెడ్డి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ఛైర్మన్, కమిటీ సభ్యులు కృషి చేయాలని MLA తెలిపారు.