MHBD: కేసముద్రం మండలంలో 2026-27 విద్యా సంవత్సరానికి అర్పనపల్లి, బేరువాడ, రంగాపురం ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ మంజూరయ్యాయని MEO కాలేరు యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ సంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య అందిస్తామని, దీంతో చిన్నారులకు గ్రామ స్థాయిలోనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్నారు.