AKP: బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలని ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగం, సేవాభావానికి ప్రతీకగా బక్రీద్‌ను జరుపుకుంటామని తెలిపారు.