AP: పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసులో YCP యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ MLA జక్కంపూడి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. SC కమిషన్ ఆదేశాల మేరకు కర్నూలు పోలీసులు చర్యలకు దిగారు. ఈ నెల 14న కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో.. CI శేషయ్యపై చేసిన వ్యాఖ్యలకు గాను ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.