BDK: బూర్గంపహాడ్ మండలం వేపలగడ్డ గ్రామపంచాయతీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఓ వ్యక్తిని స్థానికులు బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ వ్యక్తిని గుర్తించిన వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.