MNCL: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. గురువారం సాయంత్రం లక్షెట్టిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. క్వింటాల్ ధాన్యంపై ప్రతి రైతు రూ. 100 నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలను ఇంకా గోదాములకు తరలించలేదని, వర్షం పడితే తడుస్తాయన్నారు.