మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కసనపల్లె విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని చింతలపల్లి, కసినపల్లి గ్రామాలకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరమ్మతుల కారణంగా విద్యుత్ నిలిచిపోతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.