MLG: గోవిందరావుపేట మండలం చల్వాయిలో గురువారం నిర్వహించిన మహిళా సాధికారత సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, బస్సులు- పెట్రోల్ బంకుల నిర్వహణకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.