AP: రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 50కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.