MBNR: బాలానగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై లెనిన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు గద్వాల రేంజ్ డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ ఎస్సై నరేందర్ రెడ్డి బాలానగర్‌కు రానున్నారు. ప్రస్తుత ఎస్సై లెనిన్‌ను వీఆర్‌కు అటాచ్ చేశారు. ఆయన 2025 ఫిబ్రవరి 2 నుంచి ఇప్పటివరకు విధులు నిర్వహించారు.