రాజస్థాన్ జైపూర్‌లో కార్పొరేట్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్న హనీట్రాప్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘దిశా బాబ్లా’ గ్యాంగ్ ఏఐ టెక్నాలజీతో ఫేక్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. ప్రేమ పేరుతో ఓ ఐటీ వ్యాపారి నుంచి రూ.90 లక్షలు వసూలు చేశారు. మరో రూ.50 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.