MLG: ములుగు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో BRS ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని BRS జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని, BRS హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు పార్టీ శ్రేణులు రేపు వివరించాలని లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు.