టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. పారిశ్రామికవేత్త అర్ష్ ఔలఖ్తో తన వివాహం జరిగినట్లు ఆమె ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. చండీగఢ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.