మహారాష్ట్రలో వందేభారత్ రైలు పట్టాలు తప్పింది. ముంబై నుంచి సోలాపూర్ వెళ్తున్న ట్రైన్ పూణె స్టేషన్ సమీపిస్తుండగా రైలు పట్టాలు తప్పింది. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా పూణే మార్గంలో వెళ్లే ప్రధాన ఎక్స్ప్రైస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వందే భారత్ రైలు పట్టాలు తప్పడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.