ADB: జిల్లా స్థాయి క్రీడాకారులు ఈనెల 27న నిజామాబాదులో నిర్వహించే రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణించాలని అసోసియేషన్ జిల్లాధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సబ్ జూనియర్ క్రీడాకారులను ఎంపిక చేసి క్రీడా సామాగ్రిని అందజేశారు. సభ్యులు జ్యోతి, అజయ్, గౌతమ్, హరిచరణ్ ఉన్నారు.