WNP: ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని వనపర్తి డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిధిలోని పలు గ్రామాలలో నుంచి 12 ఫిర్యాదులను, సూచనలను ఫోన్ ద్వారా డీఎం స్వీకరించారు. సమస్యలు, సూచనలు పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.