KMR: భిక్కనూరు మండల కేంద్రంలోని 16వ వార్డ్‌లో, ఇవాళ మురికి కాలువల నిర్మాణ పనులను, మండల ప్రత్యేక అధికారి, డీఎల్ఓ శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ రేఖ సుదర్శన్‌తో కలిసి ప్రారంభించారు. కాలనీలో నెలకొన్న మురికి కాలువల సమస్య పరిష్కారం కోసం, నూతనంగా మురికి కాల్వలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి ఉన్నారు.