NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరు మున్సిపాలిటీలోని అంగడిపేటలో ఏటీసీ, ఐటీఐ కళాశాలల నిర్మాణ స్థలాలను సోమవారం పరిశీలించారు. ఈ రెండింటినీ ఒకే క్యాంపస్లో నిర్మించేలా 5 ఎకరాల స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బంగారుగడ్డలో పీహెచ్సీ భవన స్థలాన్ని సందర్శించి, రోడ్డుకు ఆనుకుని ఉండేలా దేవాదాయ శాఖ భూమిని కేటాయించారు.