ముంబైతో మ్యాచ్లో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 200 పరుగుల లక్ష్యఛేదనలో 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో రబాడ(1), ఆశోక్ శర్మ(0) ఉన్నారు. ముంబై యువ బౌలర్ అశ్వనీ కుమార్ 11వ ఓవర్ చివరి బంతికి తెవాటియా(8)ను.. 13వ ఓవర్ రెండో బంతికి రషీద్(4)ను, చివరి బంతికి షారుఖ్(17) పెవిలియన్ బాట పట్టించాడు.