VKB: పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరి జనగణన కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం జడ్పీహెచ్ఎస్ నంబర్ వన్ పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్యుమరేటర్లు ప్రతి గృహాన్ని సందర్శించి సమగ్ర వివరాలను నమోదు చేయాలని సూచించారు. శిక్షణలో వివరించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు.