NRPT: నర్వ మండలంలోని లంకల గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో పది రోజులుగా తాగునీరు భారీగా వృథా అవుతోంది. చిన్న లీకేజీగా భావించి అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని గ్రామస్థులు కోరుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టి, తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.