BDK: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. నేటి అర్ధరాత్రి నుంచి కార్మికులు చేపట్టనున్న సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని,కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.