IPL 2026: ఢిల్లీతో మ్యాచ్లో తన శిష్యుడు, SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ చేయడంపై మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘బ్యాట్నే పని చేయనివ్వండి. రోజురోజుకీ మెరుగుపడుతూ.. బాగా ఆడారు అభిషేక్ సార్. ఇలాగే కొనసాగించండి’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో అభిషేక్ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 135 రన్స్ చేశాడు. IPLలో అతనికిది రెండో సెంచరీ.