TG: RTC కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందరూ సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని ఆ సంస్థ MD Y.నాగిరెడ్డి విజ్ఙప్తి చేశారు. IAS అధికారుల కమిటీకి సమస్యల పరిష్కారంపై 4 వారాల సమయం పడుతుందని, అన్నింటినీ దశలవారీగా నెరవేరుస్తామని తెలిపారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా.. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరూ సహకరించాలని కోరారు.