TG: కాళేశ్వరం కేసులో హైకోర్టు ఎవరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని, కేవలం సాంకేతిక అంశాలపైనే మాట్లాడిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. నిబంధనల ప్రకారమే దర్యాప్తును సీబీఐకి అప్పగించామని, కేంద్ర సంస్థలు కూడా అవినీతిని ధృవీకరించాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి తప్పించుకోవాలని చూస్తున్నారని, దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులకు శిక్ష పడటం ఖాయమని వెల్లడించారు.