SDPT :మర్కూక్‌లో జరిగిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో తోర్నాల పరిశోధన స్థానం నిపుణులు వానాకాలం సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. సాగు ఖర్చు తగ్గించేందుకు పచ్చిరొట్ట ఎరువుల వాడకం, నేరుగా విత్తే పద్ధతి (DSR), నాణ్యమైన విత్తనాల వినియోగంపై శాస్త్రవేత్తలు కీలక సూచనలు చేశారు.