KNR: అధిక దిగుబడి ఇచ్చేందుకు దోహదపడే విత్తనశుద్ధిపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రైతులను కోరారు. మానకొండూర్ మండలం రంగపేట గ్రామంలో మంగళవారం విత్తనశుద్ధి మిషన్, గోదాంను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎస్.అన్వేష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.