NGKL: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వడదెబ్బ రోగుల కోసం ప్రత్యేక వార్డు, 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. రోగుల సౌకర్యార్థం తాగునీటి వసతి, స్టీల్ కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. గర్భిణీలు, ఇతర రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని సూపరింటెండెంట్ డా.టి.ఉషారాణి తెలిపారు.