IPL 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జోరుకు రాజస్తాన్ బ్రేక్ వేసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన పంజాబ్.. తొలిసారి ఓటమి చవిచూసింది. అయితే, KKRతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. మరో ఆరు మ్యాచ్లలో గెలిచింది. దీంతో 13 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో పంజాబ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.