BPT: బక్రీద్ పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఇస్లాంపేట ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఈద్గాకు చేరుకుని నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.