MDK: వడ్ల కొనుగోళ్లలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై నెపం మోపుతున్నారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ధాన్య సేకరణకు అవసరమైన నిధులు, సంచులు, కమీషన్లు అన్నీ కేంద్రమే ఇస్తుందన్నారు. రాష్ట్రం మిల్లింగ్ పూర్తి చేశాకే ఎఫ్సీఐ బియ్యం సేకరిస్తుందని, కొనుగోళ్ల ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.