NLG: మండు వేసవిలోనూ నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ సమీపంలోని ఎత్తిపోతల జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది. గత రెండు రోజులుగా ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతానికి వరద నీరు పోటెత్తింది. సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి పాలకడలిలా దూకుతున్న జలసిరులు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.