NLG: నల్గొండ పరిధిలోని చర్లపల్లి మాజీ సర్పంచ్, సీనియర్ సీపీఎం నాయకులు వంగరి సత్తయ్య(90) మృతి చెందారు. సీపీఎం నేతలు సీతారాములు, సుధాకర్ రెడ్డి గురువారం నివాళులర్పించారు. సుమారు 70 ఏళ్లుగా పేదల పక్షాన పోరాడారని, సర్పంచిగా గ్రామ అభివృద్ధికి, భూపోరాటాలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని వారు కొనియాడారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు.